తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బాబ్రీ ఘటనకు 27ఏళ్లు.. అయోధ్యలో భారీగా బలగాలు

బాబ్రీ మసీదు ఘటన జరిగి నేటికి 27 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఉత్తర్ ప్రదేశ్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అయోధ్యలో వివాదాస్పద స్థలంపై ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు.

By

Published : Dec 6, 2019, 5:06 AM IST

Updated : Dec 6, 2019, 3:36 PM IST

27-years-for-babri-incident
బాబ్రీ ఘటనకు 27ఏళ్లు.. అయోధ్యలో భారీగా బలగాలు

బాబ్రీ ఘటనకు 27ఏళ్లు.. అయోధ్యలో భారీగా బలగాలు

అయోధ్యలోని బాబ్రీ మసీదు ఘటన జరిగి నేటికి సరిగ్గా 27 ఏళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భంగా ఉత్తర్​ప్రదేశ్​లో భద్రతను కట్టుదిట్టం చేసింది ప్రభుత్వం. అయోధ్యలో వివాదాస్పద స్థలంపై ఇటీవల సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. అయోధ్య ఉన్న ఫైజాబాద్ ​జిల్లాను జోన్​లుగా విభజించి ఒక్కో జోన్​కు ఒక్కో ఎస్పీ పర్యవేక్షించేలా చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర అదనపు పోలీస్​ జనరల్​ రామశాస్త్రి వెల్లడించారు.

ముందస్తు జాగ్రత్తగా అనుమానం ఉన్న 305మందిని అదుపులోకి తీసుకున్నామని అయోధ్య ఎస్​ఎస్​పీ ఆశిష్ తివారీ తెలిపారు. అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నామని, క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని వివరించారు. ఎలాంటి పుకార్లను నమ్మవద్దని పోలీసులు ప్రజలకు సూచించారు. శాంతి సామరస్యం కోసం మత పెద్దలతో సమావేశం నిర్వహించారు అధికారులు.

ఇదీ చూడండి: '100 శాతం నేర రహిత రాజ్యం రాముడికీ సాధ్యం కాదు'

Last Updated : Dec 6, 2019, 3:36 PM IST

ABOUT THE AUTHOR

...view details