ఇటీవల జరిగిన కోజికోడ్ విమాన ప్రమాద ఘటనలో సహాయక చర్యలు చేపట్టిన 26 మంది వలంటీర్లకు కరోనా పాజిటివ్‌గా తేలింది. వీరిలో స్థానిక జిల్లా కలెక్టర్, ఎస్పీ సహా ఇతర అధికారులు కూడా ఉన్నారు.
ఆగస్టు 7న కేరళలోని కోజికోడ్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు అందించారు. భారీ వర్షాన్ని లెక్కచేయకుండా క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించడంలో కీలక పాత్ర పోషించారు.