రాజస్థాన్ జైపుర్‌లో కరోనా మహమ్మారి తీవ్ర కలకలం రేపుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా చార్దీవారీ ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన 26 మంది కరోనా బారిన పడ్డట్లు వైద్యులు నిర్ధరించారు.
ఇదే మొదటిసారి?...ఒకే ఇంట్లో 26 మందికి కరోనా - corona virus to 26 members of same family in jaipur
రాజస్థాన్‌లోని జైపుర్‌లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు బయటపడుతున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన 26 మందికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయ్యింది. దీంతో రాత్రికి రాత్రే బాధితులను ఆసుపత్రికి తరలించారు అధికారులు.
![ఇదే మొదటిసారి?...ఒకే ఇంట్లో 26 మందికి కరోనా 26-people-of-same-family-found-corona-positive-in-jaipur](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7538978-1035-7538978-1591684515963.jpg)
ఒకే ఇంట్లో 26 మందికి కరోనా పాజిటివ్!
విషయం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఒక్క ఇంట్లో ఇంత ఎక్కువ మందికి కరోనా సోకడం ఇదే తొలిసారి అంటున్నారు. దీంతో ఆ ఇంటి ముందు అంబులెన్స్‌లు బారులు తీరాయి. రాత్రికి రాత్రే 26 మందిని ఆసుపత్రికి తరలించారు. జైపుర్ జిల్లాలో ఇప్పటికే 2260 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధరణ అయ్యింది.
Last Updated : Jun 9, 2020, 2:18 PM IST