తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'26'... భారత్​కు ఈ సంఖ్య ఎంతో ప్రత్యేకం తెలుసా? - భారత గణతంత్ర దినోత్సవం గురించి

1949 నవంబర్​ 26న భారత రాజ్యాంగాన్ని ఆమోదించారు. 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఈ '26'కు భారత స్వాతంత్య్ర ఉద్యమానికి ఎంతో సంబంధముంది.

constitution
constitution

By

Published : Jan 26, 2020, 9:00 AM IST

Updated : Feb 18, 2020, 10:50 AM IST

భారత రాజ్యాంగాన్ని 1949 నవంబరు 26న ఆమోదించగా, 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. 26వ తేదీకో ప్రత్యేకత ఉంది.

భారతదేశానికి సంపూర్ణ స్వరాజ్యాన్ని కాంక్షిస్తూ 1929-30 మధ్యకాలంలో ఉద్యమం ఉద్ధృతంగా సాగింది. దశలవారీగా స్వాతంత్య్రాన్ని మహాత్మాగాంధీ కాంక్షించగా.. తక్షణ స్వాతంత్య్రం కోసం నెహ్రూ, సుభాష్‌ చంద్రబోస్‌ డిమాండ్‌ చేశారు. చివరికి భారత స్వాత్రంత్య తీర్మానాన్ని తయారు చేసి.. 1929 డిసెంబరు 31న నెహ్రూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. 1930 జనవరి 26వ తేదీన 'సంపూర్ణ స్వరాజ్యం' ప్రకటనను బహిరంగంగా విడుదల చేశారు. ఆ రోజు నుంచి జనవరి 26వ తేదీని భారత స్వాతంత్య్ర దినోత్సవంగా స్వాతంత్రోద్యమకారులు పాటిస్తూ వచ్చారు.

1947లో బ్రిటిష్‌ ప్రభుత్వం భారతదేశానికి స్వాతంత్య్రం ఇచ్చినప్పుడు కూడా.. జనవరి 26వ తేదీనాడే ఇవ్వాలని మన సమరయోధులు కోరారు. కానీ... నాటి గవర్నర్‌ జనరల్‌ మౌంట్‌బాటన్‌ మాత్రం ఆగస్టు 15వ తేదీ వైపు మొగ్గుచూపారు. 1930 నాటి సంపూర్ణ స్వరాజ్య ప్రకటన జనవరి 26వ తేదీన జరిగింది కాబట్టి.. అదే తేదీన (1950లో) రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చారు.

Last Updated : Feb 18, 2020, 10:50 AM IST

ABOUT THE AUTHOR

...view details