బిహార్ బోధ్ గయాలోని ఓ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన 25 మందికి కరోనా సోకినట్లు నిర్ధరించారు వైద్యులు. దీంతో ఇంటిల్లిపాదిని ఐసోలేషన్ వార్డుకు తరలించారు.
వద్దన్నా వినకుండా...
కరోనా కాలంలో సమూహాలుగా తిరగొద్దని, జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వాలు గొంతుచించుకుంటున్నా.. బోధ్ గయాకు చెందిన ఆ కుటుంబంలోని ఓ నవజాత శిశువు తలనీలాలు సమర్పించేందుకు ఝార్ఖండ్‌కు వెళ్లారు. ఆ కార్యక్రమంలో మరెందరో బంధువులు పాల్గొన్నారు. తిరిగి ఇళ్లకు చేరుకున్నాక, కొందరికి ఆరోగ్యం క్షీణించింది. దీంతో కుటుంబ సభ్యులందరు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. దాదాపు 30 మంది నమూనాల్లో 25 మందికి కొవిడ్-19 పాజిటివ్ అని తేలింది.