తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రేపు 'భారత్ బంద్'​- 25 కోట్ల మంది పాల్గొంటారని అంచనా​ - రేపు 'భారత్ బంద్'​- 25 కోట్లమంది పాల్గొనే అవకాశం​

బుధవారం అఖిల భారత సమ్మెకు పిలుపునిచ్చాయి కేంద్ర కార్మిక సంఘాలు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా, జాతి వ్యతిరేక విధానాలకు నిరసనగా 'భారత్​ బంద్​' నిర్వహించనున్నట్లు స్పష్టం చేశాయి. 10 కేంద్ర కార్మిక సంఘాలు, పలు ప్రభుత్వరంగ బ్యాంకు ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు ఈ సమ్మెలో భాగం కానున్నాయి.

25 crore people likely to participate in nationwide strike on Jan 8: Trade unions
రేపు 'భారత్ బంద్'​- 25 కోట్లమంది పాల్గొనే అవకాశం​

By

Published : Jan 7, 2020, 6:40 PM IST

Updated : Jan 7, 2020, 9:58 PM IST

భారత్ బంద్

కేంద్ర ప్రభుత్వ 'ప్రజావ్యతిరేక' విధానాలకు నిరసనగా 10 కేంద్ర కార్మిక సంఘాలు బుధవారం దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. 'భారత్ బంద్'​ పేరుతో నిర్వహిస్తున్న ఈ సమ్మెలో 25 కోట్ల మంది పాల్గొనే అవకాశం ఉందని అంచనా. ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, సీఐటీయూ, టీయూసీసీ తదితర కార్మిక సంఘాలతో పాటు ఏఐబీఈ, ఏఐబీఓఏ, బీఈఎఫ్​ఐ, ఐఎన్​బీఈఎఫ్​ వంటి బ్యాంకు ఉద్యోగ సంఘాలు భారత్ బంద్​లో పాల్గొనేందుకు సుముఖత వ్యక్తం చేశాయి.

ఈనెల 2వ తేదీన జరిగిన సమావేశంలో కార్మికుల డిమాండ్లపై భరోసా ఇవ్వడంలో కేంద్ర కార్మికశాఖ విఫలమైందని, అందుకే ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా జనవరి 8న అఖిల భారత సమ్మె చేపట్టనున్నట్లు పది కేంద్ర కార్మిక సంఘాలు సంయుక్త ప్రకటనలో తెలిపాయి.

విద్యాసంస్థల్లో పెరిగిన ఫీజులు, విద్య వ్యాపారీకరణకు వ్యతిరేకంగా 60 విద్యార్థి సంఘాలు, విశ్వవిద్యాలయాలకు చెందిన పలు సంఘాలు కూడా ఈ సమ్మెలో పాల్గొనాలని నిర్ణయించాయి. ఈ సమ్మె కారణంగా బుధవారం పలు రకాల సేవలకు అంతరాయం కలగనుంది. ముఖ్యంగా బ్యాంకింగ్‌, రవాణా రంగాలపై ఇది తీవ్ర ప్రభావం చూపనుంది. అయితే ప్రైవేటు బ్యాంకులకు మాత్రం సమ్మెతో ఎలాంటి నష్టం ఉండకపోవచ్చు.

రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల మద్దతు

"కేంద్రం ఇప్పటికే దేశంలోని 12 విమానాశ్రయాలను ప్రైవేటు పరం చేసింది. ప్రభుత్వ రంగ సంస్థలైన ఎయిర్‌ ఇండియా, బీపీసీఎల్‌లను విక్రయించేందుకు నిర్ణయం తీసుకుంది. బీఎస్‌ఎన్‌ఎల్-ఎంటీఎన్‌ఎల్ విలీనం తర్వాత 93,600 మంది టెలికాం కార్మికులు వీఆర్‌ఎస్ (స్వచ్ఛంద పదవీ విరమణ) పేరుతో ఉద్యోగాలు కోల్పోయారు" అని సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి కార్మిక సంఘాలు. వీటితో పాటు రైల్వే ప్రైవేటీకరణ, 49 రక్షణ ఉత్పత్తుల తయారీ యూనిట్ల కార్పొరేటీకరణ, ప్రభుత్వ బ్యాంకుల విలీనాన్ని కూడా తాము వ్యతిరేకిస్తున్నట్లు తెలిపాయి.

సమ్మె చేశారో.. జీతంలో కోతే!

బుధవారం జరగబోయే 'భారత్ బంద్'లో తమ ఉద్యోగులను పాల్గొనకుండా చూడాలని ప్రభుత్వ రంగ సంస్థలను కోరింది కేంద్రం. ఆయా సంస్థలు సజావుగా పనిచేసేలా ప్రత్యామ్నాయ ప్రణాళికను సిద్ధం చేయాలని సూచించింది. ఉద్యోగులెవరైనా నిరసనల్లో పాల్గొంటే.. జీతంలో కోతతో పాటు క్రమశిక్షణా చర్యలను ఎదుర్కోక తప్పదని హెచ్చరించింది.

ఇదీ చూడండి : ముద్దుగుమ్మ​ అంజలికి ప్రపోజ్​ చేసిన ఆ హీరో?

Last Updated : Jan 7, 2020, 9:58 PM IST

For All Latest Updates

TAGGED:

Gangadhar Y

ABOUT THE AUTHOR

...view details