రాజస్థాన్ రాజధాని జైపుర్‌ను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం ప్రజలను రక్షించేందుకు పలు రకాల సహాయక చర్యలు చేపడుతుండగా.. ఓ మ్యూజియం సిబ్బంది మాత్రం ఈజిప్టు మమ్మీని కాపాడేందుకు శాయశక్తులు ఒడ్డారు.
మ్యూజియంలోకి నీరు చేరడంతో గ్లాస్ ఛాంబర్‌లో ఉంచిన 2,400 సంవత్సరాల ఈజిప్ట్ మమ్మీని పాడవకుండా రక్షించేందుకు తీవ్రంగా శ్రమించారు. మ్యూజియంలోకి చేరిన నడుము లోతు నీటిలో సెల్‌ఫోన్ లైట్ల వెలుతురులో ఛాంబర్ గ్లాసును బద్దలు కొట్టి అతి కష్టం మీద మమ్మీని మ్యూజియంలో నీరు చేరని చోటికి తరలించారు.