తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నమస్తే ట్రంప్: మోటేరా సభకు 2,200 బస్సులు

ఈ నెల 24న గుజరాత్​ అహ్మదాబాద్​లోని మోటేరా స్టేడియంలో జరగనున్న 'నమస్తే ట్రంప్'​ కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి జనాన్ని తీసుకువచ్చేందుకు 2,200కు పైగా బస్సులను ఏర్పాటు చేశారు.

2,200 new buses deployed ahead of Trump's visit to India
నమస్తే ట్రంప్: మోటేరా సభకు 2,200 బస్సులు!

By

Published : Feb 20, 2020, 5:58 PM IST

Updated : Mar 1, 2020, 11:38 PM IST

నమస్తే ట్రంప్: మోటేరా సభకు 2,200 బస్సులు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ పర్యటన కోసం గుజరాత్​ రోడ్డు రవాణా సంస్థ ఏర్పాట్లు వేగవంతం చేసింది. ఈ నెల 24న అహ్మదాబాద్​ మోటేరా స్టేడియంలో జరగనున్న 'నమస్తే ట్రంప్'​ కార్యక్రమం కోసం 2,200కు పైగా బస్సులను నడిపేందుకు సిద్ధమైంది.

ఈ బస్సుల్లో 30 వేల మందికి పైగా ప్రజలను వివిధ ప్రాంతాల నుంచి సభకు తీసుకురానున్నారు.

సులభమైన రవాణా ఏర్పాట్ల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. జీపీఎస్​ వ్యవస్థతో, మంచి కండిషన్​లో ఉన్న బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఒక్క రాజ్​కోట్​ నగరం నుంచే 400 బస్సులు రానున్నాయి.

మంచి కండిషన్​...

రాష్ట్రంలోని అన్ని ప్రధాన కేంద్రాల నుంచి ఈ బస్సులు ఉండనున్నాయి. కొత్త సిరీస్​ బస్సులు, నిబద్ధత గల చోదకులను ఇందుకోసం ప్రత్యేకంగా ఎంపిక చేసినట్లు అధికారులు వెల్లడించారు.

బస్సులను పర్యవేక్షించేందుకు సూపర్​వైజర్లను నియమించారు. ట్రంప్​ పర్యటనపై డ్రైవర్లు, కండక్టర్లకు అవగాహన కల్పించారు. కాంట్రాక్ట్​ బస్సుల ఫీజుపై 20 శాతం డిస్కౌంట్​ ఇచ్చేందుకు నిర్ణయించారు.

ట్రంప్​ పర్యటన రోజున 2,200 బస్సులను ఏర్పాటు చేసినందున కొన్ని ఎక్స్​ప్రెస్​, లోకల్​ బస్సు సర్వీసులను ఆ రోజు నిలిపివేయనున్నారు.

Last Updated : Mar 1, 2020, 11:38 PM IST

ABOUT THE AUTHOR

...view details