బంగాల్, ఒడిశాపై తీవ్ర ప్రభావం చూపిన అంపన్ తుపానును కేంద్రప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేశాయి విపక్షాలు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలో సమావేశమైన 22 పార్టీల నేతలు... ఈమేరకు తీర్మానం చేశారు.
శుక్రవారం వీడియో కాన్ఫరన్స్ ద్వారా అన్నీ పార్టీలతో మాట్లాడిన సోనియా.. అంపన్ వల్ల ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులపై విపక్ష నేతలతో చర్చించారు. కరోనా సంక్షోభం, కేంద్రం చేపడుతున్న చర్యలపైనా సమాలోచనలు జరిపారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఉపశమనం, పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రానికి అన్ని పార్టీలు సూచించాయి.