తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వరద బీభత్సం: 16 లక్షల మందిపై ప్రభావం

అసోంలోని 22 జిల్లాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదల కారణంగా మొత్తం 16 లక్షల మంది ప్రభావితమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 34 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.

22 of 33 Assam districts affected by flood, toll rises to 34
వరదల బీభత్సం.. 16 లక్షల మందిపై ప్రభావం

By

Published : Jul 3, 2020, 10:07 AM IST

అసోంను వరదలు వణికిస్తున్నాయి. రాష్ట్రంలోని 22 జిల్లాలు వరదల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. బ్రహ్మపుత్ర సహా ఉపనదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 16 లక్షల మందికి పైగా వరదలకు ప్రభావితమయ్యారు.

అసోంలో వరదల బీభత్సం

వరదల కారణంగా మాటియాల ప్రాంతంలో ఒకరు మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం మరణాల సంఖ్య 34కు చేరింది. 72,717 హెక్టార్లలో పంట భూమి నీట మునిగింది.

వరద నీటిలోనే రోడ్డు దాటుతున్న ప్రజలు
వరద నీటిలో నడస్తున్న ప్రజలు

వరదల్లో చిక్కుకున్న 2,852 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అసోం విపత్తు నిర్వహణ అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు 12,597 మందిని 163 సహాయ శిబిరాల్లోకి తరలించినట్లు తెలిపారు.

నీట మునిగిన జంతువులు

ప్రజలకు ఆహార పదార్థాలతో పాటు నిత్యావసరాలను అందించినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం సహయక చర్యలు అందక ప్రజలు అవస్థలు పడుతున్నారు.

"మా ప్రాంతాన్ని పర్యవేక్షించటానికి ఇంతవరకు ప్రభుత్వ అధికారులు ఎవ్వరు రాలేదు. ఇక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మాకు ప్రభుత్వం నుంచి వెంటనే సాయం కావాలి."

-స్థానికుడు

ఇదీ చూడండి:ఐదుగురు యువకుల ప్రాణాలు తీసిన సెల్ఫీ సరదా

ABOUT THE AUTHOR

...view details