ఛత్తీస్గఢ్లో పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో 2018 నుంచి 2020, నవంబర్ 30 వరకు 216 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలిపింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. మరోవైపు.. మూడేళ్లలో 966 మంది మావోయిస్టులు లొంగిపోయారని పేర్కొంది.
ఈ మేరకు కాంగ్రెస్ ఎమ్మెల్యే ధనేంద్ర సాహు అడిగిన ప్రశ్నకు హోంమంత్రి తమ్రధ్వాజ్ సాహు ఛత్తీస్గఢ్ శాసనసభలో రాతపూర్వక వివరణ ఇచ్చారు.