ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) అనుబంధంగా ఉండే ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్(ఐఎస్ఎం) ధన్బాద్.. 214 మంది విద్యార్థులను టెర్మినేట్ చేసింది. వచ్చే విద్యా సంవత్సరానికి గానూ ఫీజులు చెల్లించకపోవడమే ఇందుకు కారణం.
ముందస్తు రిజిస్ట్రేషన్ చేయించుకొని, ఫీజులు చెల్లించని 129 మంది విద్యార్థుల జాబితాను డిసెంబర్ 9న విడుదల చేశారు కళాశాల డీన్. మిగతా 85 మంది 2020-21 కాలానికి ఎలాంటి రిజిస్ట్రేషన్ చేసుకోలేదని తెలిపారు. ఇలా మొత్తం 214 మంది విద్యార్థులను తొలగించినట్లు పేర్కొన్నారు.