తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అయోధ్య రామాలయం కోసం 2,100 కిలోల గంట - latest news about ayodhya

అయోధ్య రామాలయం.. కోట్లాది మంది స్వప్నం. అంతటి కీలకమైన మందిరంలో ప్రతిదీ ఘనంగానే ఉండాలి. అందుకే ఏకంగా 2,100 కిలోలు బరువైన గంటను తయారు చేయిస్తోంది 'రామ్​లల్లా'.

అయోధ్య రామాలయం కోసం 2,100 కిలోల గంట

By

Published : Nov 14, 2019, 4:34 PM IST

అయోధ్య రామాలయం కోసం 2,100 కిలోల గంట

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి పనులు వేగంగా జరుగుతున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్రప్రభుత్వం అయోధ్య ట్రస్టు ఏర్పాటు చేసి, నిర్మాణ పనులు అధికారికంగా ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ... వేర్వేరు సంస్థలు తమ వంతు సాయంగా ఈ మహాక్రతువులో భాగం అవుతున్నాయి. కర్​సేవక్​పురంలో ఇప్పటికే స్తంభాలు, శిల్పాలు చెక్కే పని జోరుగా సాగుతుండగా... ఆలయానికి అవసరమయ్యే ప్రత్యేక గంటను ఎటా జిల్లా జలేసర్​లో తయారుచేయిస్తోంది 'రామ్​లల్లా'.

వేర్వేరు లోహాలు ఉపయోగించి 2 వేల 100 కిలోలు బరువైన గంటను తయారు చేస్తున్నారు. ఇందుకోసం 2 నెలలుగా అనేక మంది కార్మికులు శ్రమిస్తున్నారు. వీరిలో కొందరు ముస్లింలూ ఉండడం విశేషం.

"ఈ గంట బరువు సుమారు 2100 కిలోలు. ఇది పూర్తవడానికి 2,3 నెలలు పడుతుంది. రూ. 12-15 లక్షల వ్యయంతో దీనిని రూపొందిస్తున్నాం. ఈ గంట తయారు చేయమని గతంలో కాశీ నుంచి ఆర్డర్​ వచ్చింది. సుప్రీం తీర్పు తర్వాత పనుల్లో వేగం పెంచాం."

-వికాస్ మిత్తల్, గంట తయారీదారుడు

ఇదీ చూడండి : 'శబరిమల' కేసు విస్తృత ధర్మాసనానికి బదిలీ

ABOUT THE AUTHOR

...view details