తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పద్మ పురస్కారాల ప్రకటన.. ఆనంద్​ మహీంద్రాకు పద్మభూషణ్​ - Padma Shri Awards 2020

21 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం
జైట్లీ, సుష్మా స్వరాజ్​లకు పద్మవిభూషణ్​

By

Published : Jan 25, 2020, 7:37 PM IST

Updated : Feb 18, 2020, 9:46 AM IST

20:50 January 25

జైట్లీ, సుష్మా స్వరాజ్​లకు పద్మవిభూషణ్​

కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. 21 మందికి పద్మ శ్రీ అవార్డులను ప్రకటించిన కేంద్రం.. మరో ఏడుగురికి పద్మవిభూషణ్​, 16 మందికి పద్మభూషణ్​ పురస్కారాలు ప్రకటించింది. 

దివంగత భాజపా నేతలు అరుణ్​ జైట్లీ, సుష్మా స్వరాజ్​ సహా జార్జి ఫెర్నాండెజ్​, బాక్సర్​ మేరీ కోం, చన్నూలాల్​ మిశ్రా, అనిరుధ్​ జుగ్​నౌధ్​, విశ్వేషతీర్థస్వామిజీకి పద్మవిభూషణ్​ దక్కాయి. 

ఆనంద్​ మహీంద్రాకు పద్మభూషణ్​...

16 మందికి పద్మభూషణ్​ పురస్కారాలు ప్రకటించింది కేంద్రం. 

పద్మభూషణ్‌ పురస్కారాలు

16 మందికి పద్మభూషణ్‌ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం

మంతాజ్‌అలీ, సయ్యద్‌ మౌజీంఅలీ, ముజఫర్‌హుస్సేన్‌ బేగ్‌, అజయ్‌చక్రవర్తి, మనోజ్‌దాస్‌, బాల్‌కృష్ణదోషి, కృష్ణమ్మాల్‌ జగన్నాథన్‌, ఎస్‌.సి.జమీర్‌, అనిల్‌ ప్రకాష్‌జోషి, దివంగత మనోహర్​ పారికర్​, ప్రముఖ షట్లర్​ పీవీ సింధు, డా.సెరింగ్‌ లాండోల్‌, ఆనంద్‌ మహీంద్రా, నీలకంఠ రామకృష్ణ మాధవ మేనన్‌, జగదీశ్‌సేత్‌, వేణుశ్రీనివాసన్‌కు పద్మభూషణ్‌ పురస్కారాలు లభించాయి. 

19:33 January 25

విరబూసిన పద్మాలు..

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. అసమాన సేవలందిస్తూ....ప్రజలకు పెద్దగా పరిచయం లేని వారినే ఈసారి కూడా పద్మ పురస్కారాలకు ఎంపిక చేశారు. 21 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది.

  • జగదీశ్‌లాల్‌ అహుజా(పంజాబ్​) - సామాజిక సేవ
  • మహ్మద్‌ షరీఫ్‌(ఉత్తర్​ప్రదేశ్​) - సామాజిక సేవ
  • జావెద్ అహ్మద్(కశ్మీర్​) - సామాజిక సేవ
  • ముజికల్​ పవకలికే(కేరళ) - తోలుబొమ్మలాట కళాకారిణి
  • తులసి గౌడ(కర్ణాటక) - సామాజిక సేవ, పర్యావరణం‌
  • సత్యనారాయణ‌్(అరుణాచల్​ ప్రదేశ్​) - సామాజిక సేవ, విద్యావిభాగం
  • అబ్దుల్ జబ్బార్‌(మధ్యప్రదేశ్​) - సామాజిక సేవ
  • ఉషా చౌమార్‌(రాజస్థాన్​) - పారిశుద్ధ్యం
  • పోపట్‌రావ్‌ పవార్‌(మహారాష్ట్ర) - సామాజిక సేవ, నీటివిభాగం
  • హరికలా హజబ్బా(కర్ణాటక) - సామాజిక సేవ, విద్యావిభాగం
  • అరుణోదయ్‌ మండల్‌(బంగాల్​) - వైద్య, ఆరోగ్యం
  • రాధామోహన్‌, సంభవ్‌ సే సంచయ్‌(ఒడిశా) - సేంద్రియ వ్యవసాయం
  • కుశాల్‌ కన్వర్‌ (అసోం) - పశువైద్యం
  • ట్రినిటీ సయూ (మేఘాలయ) - సేంద్రియ వ్యవసాయం
  • రవి కన్నన్‌ (అసోం) - వైద్యం, అంకాలజీ విభాగం
  • ఎస్‌.రామకృష్ణన్‌ (తమిళనాడు) - సామాజిక సేవ, దివ్యాంగుల సంక్షేమం
  • సుందరం వర్మ (రాజస్థాన్‌) - పర్యావరణం, అడవుల పెంపకం

వీరితో పాటు.. రాజస్థాన్‌కు చెందిన మున్నా మాస్టర్‌ ( సంగీతం ), ఉత్తరాఖండ్‌కు చెందిన యోగి ఎరాన్‌‍‍ ( వైద్యం), మహారాష్ట్రకు చెందిన రహిబాయ్‌ సోమ( సేంద్రీయ వ్యవసాయం), రాజస్థాన్‌కు చెందిన హిమ్మత్‌ రామ్‌ ( సామాజిక సేవ)కు పద్మశ్రీ పురస్కారాలు వరించాయి

Last Updated : Feb 18, 2020, 9:46 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details