కర్ణాటకలోని బెంగళూరు ట్రాఫిక్ విభాగం.. జరిమానాల్లో రికార్డు సృష్టించింది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా వారం వ్యవధిలోనే వాహనదారుల నుంచి రూ. 21 కోట్ల 43 లక్షల 80 వేలు జరిమానాల ద్వారా రాబట్టారు.
సెప్టెంబర్ 13-19 మధ్య నమోదైన 48 వేల 141 కేసుల ద్వారా ఈ మొత్తం వసూలు చేసినట్లు స్పష్టం చేశారు ట్రాఫిక్ పోలీసులు.
కరోనా లాక్డౌన్ సమయంలో సాంకేతికతను ఉపయోగించి కేసులు నమోదు చేశారు. అన్లాక్ తర్వాత ట్రాఫిక్ ఉల్లంఘనులపై తీవ్రంగా దృష్టి సారించిన పోలీసులు పక్కాగా ప్రతి ఒక్క వాహనదారుడినీ తనిఖీ చేశారు.
ఈ కేసుల్లో ఎక్కువగా ప్రమాదకర డ్రైవింగ్, సైలెన్సర్ సమస్య, నిషేధిత స్థలంలో వాహనాల పార్కింగ్, డ్రైవింగ్ చేస్తూ ఫోన్ వాడటం, సీట్ బెల్ట్ ధరించకపోవడం వంటివి ఉన్నాయి.