ముంబయి తర్వాత దేశంలో కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్. ఇక్కడ రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. అయితే ఈ జిల్లాలో గత రెండు నెలల్లో మొత్తం 21 మంది చిన్నారులు కరోనా వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయినట్లు వైద్య అధికారులు తెలిపారు. వీరిలో 20 రోజుల నవజాత శిశివు కుడా ఉన్నట్లు పేర్కొన్నారు. చిన్నారుల తల్లులు.. వారు కోలుకోవడానికి తీవ్రంగా శ్రమించినట్లు పేర్కొన్నారు.
ఇండోర్‌లోని చాయిత్రం ఆస్పత్రిలో 20 రోజుల శిశువు, రెండు నెలలు, 18 నెలల చిన్నారులు.. గత 15 రోజుల్లో డిశ్చార్జ్ అయినట్లు సీనియర్ వైద్యులు డా. రష్మి షాద్ తెలిపారు. చికిత్స అనంతరం నిర్వహించిన వైద్య పరీక్షలో వారికి రెండు సార్లు నెగిటివ్ వచ్చినట్లు వివరించారు. వీరితో పాటు రెండేళ్ల వయసులోపు ఉన్న మరో 18 మంది చిన్నారులు శ్రీ ఔరబిందో ఆస్పత్రి నుంచి గత 45 రోజుల్లో డిశ్చార్జి అయ్యారు.
చిన్నారులంతా రోగ నిరోధక శక్తితోనే వైరస్‌పై పోరాడి గెలిచినట్లు వైద్యులు చెప్పారు.