తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కొంతమంది వామపక్ష విద్యార్థులతో విద్యా వ్యవస్థకు దెబ్బ'

దేశంలోని విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థల్లో నెలకొన్న పరిస్థితులపై పలువురు వీసీలు సహా 200 మంది విద్యావేత్తలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఇటీవల విద్యాసంస్థల్లో తలెత్తిన సమస్యల వెనక వామపక్ష విద్యార్థుల రహస్య ఎజెండా దాగుందని ఆరోపించారు.

By

Published : Jan 12, 2020, 6:43 PM IST

modi
'కొంతమంది వామపక్ష విద్యార్థులతో విద్యావ్యవస్థకు దెబ్బ'

విశ్వవిద్యాలయాల్లో చదువుకునే వాతావరణం దెబ్బతీయడానికి వామపక్ష విద్యార్థి సంఘాల కోటరీలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు పలు విశ్వవిద్యాలయాల వీసీలు సహా 200 మందికి పైగా విద్యావేత్తలు. సమస్యను వివరిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. విద్యా సంస్థల్లో వామపక్ష అరాచకానికి వ్యతిరేక ప్రకటన పేరుతో రాసిన ఈ లేఖను ప్రధానికి పంపించారు.

"విద్యార్థి రాజకీయాల పేరుతో బెదిరింపులకు పాల్పడటాన్ని ఇటీవల మేం గమనించాం. దీని వెనక వామపక్ష ఎజెండా ఉంది. జేఎన్​యూ, జామియా, అలీగఢ్, జాదవ్​పుర్​ వర్సిటీల్లో ఇటీవల జరిగిన పరిణామాలు.. వర్సిటీల్లో క్షీణిస్తున్న విద్యావాతావరణానికి సూచిక. దీని వెనక వామపక్షీయుల రహస్య ఎజెండా దాగుంది."

-ప్రధానికి రాసిన లేఖలోని భాగం

విద్యార్థి రాజకీయాల పేరిట వామపక్ష కార్యకర్తలు విఘాతకరమైన ఎజెండాను విద్యాలయాల్లో అమలు చేస్తున్నట్లు ఆరోపించారు. బంద్​లు, ధర్నాలు, ఆచరణ సాధ్యం కాని డిమాండ్లను వామపక్ష వాదులు చేస్తున్నారని లేఖలో విద్యావేత్తలు ఉటంకించారు. వారికి వ్యతిరేక గళమెత్తితే వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకోవడం, బహిరంగంగా విమర్శలు చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. వామపక్షీయుల తీరుతో బలహీన వర్గాల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నట్లు వ్యాఖ్యానించారు. ఇలాంటీ హింసాత్మక ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రధానిని కోరారు.

ఇదీ చూడండి: రాజస్థాన్​లో పండగ కోసం ముస్తాబైన 'ఒంటెలు'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details