దేశంలో కరోనా కేసులు క్రమంగా విస్తరిస్తున్నాయి. దేశంలో 223 మందికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే దేశవ్యాప్తంగా నలుగురు మృతి చెందినట్లు అధికారులు స్పష్టం చేశారు. కరోనాకు సంబంధించిన సమాచారం, ఫిర్యాదుల కోసం 1075ని సంప్రదించాలని సూచించారు. కరోనాపై పోరాడేందుకు అవసరమైన సౌకర్యాలకు కొరత ఉన్నట్లు పేర్కొన్నారు.
అదే సమయంలో భారత్‌లో వైద్య పరిశోధనలు చేసే ఐసీఎంఆర్ 13,486 రక్తనమూనాలను పరిశీలించినట్లు స్పష్టం చేసింది. అయితే దేశంలో ఉన్న కరోనా బాధితుల్లో 32 మంది విదేశీయులని వెల్లడించింది. మహారాష్ట్రలో 47 కేసులు, కేరళలో 28, హరియాణాలో 17, ఉత్తర్‌ప్రదేశ్‌లో 19, తెలంగాణలో 16, కర్ణాటకలో 15, లద్దాఖ్‌లో 10 , రాజస్థాన్‌లో 9 కేసులు, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ల్లో రెండు కేసుల చొప్పున నమోదైనట్లు స్పష్టం చేసింది.
అదే సమయంలో కరోనాపై పోరాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండింతలు సవాలుగా తీసుకుని ఉద్యమిస్తున్నాయి.
'కలిసి పనిచేద్దాం..'
వైరస్ నియంత్రణకు కలిసికట్టుగా పోరాడాదమని పిలుపునిచ్చారు బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ప్రధాని మోదీ జనతా కర్ఫ్యూ పిలుపు మేరకు ఇళ్లల్లోనే ఉండాలని, వైరస్ వ్యాప్తిని అరికట్టాలని సూచించారు.
వసుంధర రాజె స్వీయ నిర్బంధం
రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజె, ఆమె కుమారుడు, భాజపా ఎంపీ దుష్యంత్ సింగ్ స్వీయ నిర్బంధాన్ని విధించుకున్నారు. కరోనా పాజిటివ్‌గా తేలిన ఓ బాలీవుడ్ గాయనిని కలిసిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ గాయని ఇచ్చిన విందుకు రాజె, ఆమె తనయుడు హాజరయ్యారు.
కేరళలో ఇద్దరు ఎమ్మెల్యేలు