తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్​ - 2019 ఎన్నికలు

సార్వత్రిక ఎన్నికల చివరి విడత పోలింగ్​ ఈసీ కట్టుదిట్టమైన చర్యల మధ్య ప్రశాంత వాతావరణంలో సాగుతోంది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేంద్ర బలగాలు పటిష్ఠ చర్యలు చేపట్టాయి. 11 గంటల వరకు జరిగిన ఎన్నికల్లో అత్యధికంగా బంగాల్​లో 32.15 ఓటింగ్​ శాతం నమోదైంది.

ప్రశాంతంగా ఓటింగ్​

By

Published : May 19, 2019, 12:04 PM IST

Updated : May 19, 2019, 12:40 PM IST

2019 సార్వత్రికం చివరి విడత ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. ఓటేసేందుకు లైన్లలో వేచిఉన్నారు ఓటర్లు. ఉదయం 11 గంటల వరకు నమోదైన పోలింగ్​ శాతాల్ని ప్రకటించింది ఎన్నికల సంఘం. బంగాల్​లో అత్యధికంగా 32.15, అత్యల్పంగా బిహార్​లో 18.90 శాతం ఓటింగ్​ జరిగింది.

పోలింగ్​ ప్రశాంతం

గత విడత సార్వత్రిక ఎన్నికల్లో అల్లర్లను దృష్టిలో ఉంచుకొని.. ఈసీ మరింత పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లకు ఉపక్రమించింది. ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఆసక్తి చూపిస్తున్నారు.

యూపీ, బంగాల్​లలో అక్కడక్కడా అల్లర్లు చోటుచేసుకున్నాయి.

11 గంటల వరకు నమోదైన పోలింగ్​ శాతాలు...

ఓటింగ్​ సరళిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న ఎన్నికల సంఘం పోలింగ్​ శాతాలను ప్రకటించింది. 11 గంటల వరకు అత్యధిక పోలింగ్​ బంగాల్​​లో నమోదైంది.

రాష్ట్రం పోలింగ్​ శాతం
ఝార్ఖండ్​ 30.33
పశ్చిమ్​ బంగ 32.15
మధ్యప్రదేశ్​ 28.40
ఉత్తర్​ప్రదేశ్​ 21.89
బిహార్​ 18.90
పంజాబ్​ 23.36
ఛండీగడ్​ 22.30
హిమాచల్​ప్రదేశ్​ 24.29

2019 సార్వత్రిక ఎన్నికల పోలింగ్​ నేటితో ముగియనుంది. మే 23న ఓట్ల లెక్కింపు జరిపి అదే రోజు ఫలితాల్ని వెల్లడించనున్నారు.

ఇదీ చూడండి :

హిమాచల్​లో ఓటేసేందుకు సిద్ధమైన శతాధికుడు

Last Updated : May 19, 2019, 12:40 PM IST

ABOUT THE AUTHOR

...view details