ఉన్నావ్ కేసు: బతికున్నంత కాలం జైల్లోనే సెంగార్
ఉన్నావ్ అత్యాచార కేసులో భాజపా బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కు జీవిత ఖైదు విధించింది దిల్లీ తీస్‌హజారీ కోర్టు. బాధితురాలి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
ఉన్నావ్ అత్యాచార కేసుపై దిల్లీ తీస్‌హజారీ కోర్టు తీర్పు వెలువరించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో దోషిగా తేలిన భాజపా బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్‌కు జీవిత ఖైదు విధించింది. ఆయన జీవించినంత కాలం జైలులోనే గడపాలని స్పష్టం చేసింది.
విచారణ చేపట్టిన న్యాయమూర్తి ధర్మేశ్ శర్మ.. సెంగార్‌కు రూ.25 లక్షల జరిమానా విధించారు. నెల రోజుల్లోపు చెల్లించాలని తేల్చి చెప్పారు.
జరిమానాలో బాధితురాలికి పరిహారం కింద రూ.10 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. మిగతా రూ.15 లక్షలు విచారణకు సంబంధించిన ఖర్చుల నిమిత్తం ఇవ్వాలని పేర్కొంది.
భద్రత కల్పించాలి..