తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎగ్జిట్​పోల్స్​లో కచ్చితత్వం ఎంత? గతంలో ఏం జరిగింది? - UPA

సార్వత్రిక ఎన్నికల అనంతరం మరోమారు కేంద్రంలో భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ అధికారం చేజిక్కించుకుంటుందని దాదాపు అన్ని ఎగ్జిట్​ పోల్స్​ స్పష్టం చేశాయి. కానీ వాటిలో కచ్చితత్వం ఎంత? 2014లో ఏ సంస్థ ఏం చెప్పింది? వాటి అంచనాలు గతంలో నిజమయ్యాయా? అన్న అంశంపై ప్రస్తుతం విస్తృత  చర్చ జరుగుతోంది. 2014తో పాటు 2009,2004లో ఎగ్జిట్​పోల్స్​ ఏం చెప్పాయో ఓ లుక్కేద్దాం.

ఎగ్జిట్​పోల్స్​ కచ్చితత్వం ఎంత? 2014లో ఏం చెప్పాయి?

By

Published : May 21, 2019, 5:13 AM IST

దేశంలో సార్వత్రిక ఎన్నికల పర్వం పూర్తయింది. భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికే మరోసారి అధికారం దక్కుతుందని అన్ని సంస్థల ఎగ్జిట్​ పోల్స్ అంచనాలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో 2014 ఎన్నికల్లో ఎగ్జిట్​ పోల్స్​ ఏం చెప్పాయి... అంచనాలకు తగినట్టే తుది ఫలితాలను వచ్చాయా అనే విషయాలను పరిశీలిద్దాం.

2004, 2009 విఫలం

2004, 2009 ఎన్నికల్లో ఎగ్జిట్​ పోల్స్​ విఫలమయ్యాయి. యూపీఏ, ఎన్డీఏల మధ్య గట్టి పోటీ ఉంటుందని చెప్పినప్పటికీ ఫలితాలు తారుమారయ్యాయి. రెండు సార్లూ యూపీఏ కూటమి సునాయసంగానే అధికారం చేజిక్కించుకుంది.

2014 ఎగ్జిట్​ పోల్స్​

2014లో మొత్తం 7 సంస్థలు తమ ఎగ్జిట్​ పోల్స్​ను ప్రకటించగా అందులో న్యూస్​-24 చాణక్య మాత్రమే దాదాపు కచ్చితమైన ఫలితాలను అంచనా వేయగలిగింది. ఎన్డీఏకు 340 సీట్లు వస్తాయని పేర్కొనగా.. అప్పటి ఎన్నికల్లో 336 సీట్లు వచ్చాయి. యూపీఏ కూటమికి 70 సీట్లు అంచనా వేయగా 59 సీట్లు వచ్చాయి.

ఎగ్జిట్​ పోల్స్​ ఎన్డీఏ యూపీఏ
న్యూస్​ 24 చాణక్య 340 70
ఇండియా టీవీ-సీ ఓటర్​ 289 101
ఏబీపీ నిల్సన్ 281 97
సీఎన్​ఎన్​-ఐబీఎన్​ సీఎస్​డీఎస్ 280 97
హెడ్​లైన్స్​ టుడే సిసీరో 272 115
ఎన్డీటీవీ 279 103
టైమ్స్​ నౌ-ఓఆర్​జీ 249 148

ఈసారి అన్ని సంస్థలు ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని ప్రకటించాయి. సుమారు 300 పైచిలుకు సీట్లు సాధిస్తుందని తెలిపాయి. కానీ ఏబీపీ న్యూస్​, నేత న్యూస్​ ఎక్స్​ మాత్రమే అధికార కూటమికి మెజారిటీ తగ్గిపోతుందని తెలిపాయి. ఎన్డీఏకు 267 సీట్లు వస్తాయని ఏబీపీ న్యూస్​ చెప్పగా, న్యూస్​ ఎక్స్​ 242 వస్తాయని తెలిపింది.

ఏ సంస్థ ఎగ్జిట్​ పోల్స్​ ఎంత కచ్చితమైన ఫలితాలను అంచనా వేశాయో మరో రెండు రోజుల్లో తేలనుంది.

ఇదీ చూడండి:ఆచితూచి వ్యవహరిస్తోన్న ఎస్పీ, బీఎస్పీ..!

ABOUT THE AUTHOR

...view details