నిర్భయ దోషుల ఉరి మరోమారు వాయిదా పడింది. దోషుల్లో ఒకడైన పవన్ గుప్తా దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన అనంతరం దిల్లీ కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఉరిపై స్టే విధించాలని కోరుతూ దోషి వ్యాజ్యం దాఖలు చేశాడు. తదుపరి ఆదేశాలు అందే వరకు ఉరి శిక్ష అమలు కాదని కోర్టు స్పష్టం చేసింది.
నిర్భయ దోషుల ఉరి మరోమారు వాయిదా - nirbhaya convict pawan gupta
Launch of Realme fitness band and Realme 6-series on March 5. Salman Khan is talking about Realme 6 series.
17:33 March 02
వాయిదా...
16:16 March 02
వాదనలు ఇలా...
నిర్భయ కేసులో నలుగురు దోషుల్లో ఒకడైన పవన్ కుమార్ గుప్తా దాఖలు చేసిన క్షమాభిక్ష పటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించారు. మిగతా ముగ్గురు దోషుల పిటిషన్లు కూడా ఇప్పటికే తిరస్కరించారు రాష్ట్రపతి.
నిర్భయ దోషి పవన్ కుమార్ గుప్తా పిటిషన్‌పై తీర్పు రిజర్వు చేసింది పటియాలా హౌస్ కోర్టు. డెత్ వారెంట్లపై స్టే కోరుతూ పిటిషన్ వేశాడు పవన్. రాష్ట్రపతి ముందు క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందున స్టే ఇవ్వాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించాడు.
వాదనలు...
ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా పవన్ తరఫు న్యాయవాది ఏ పీ సింగ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు అదనపు సెషన్ జడ్జి. క్యురేటివ్, క్షమాభిక్ష పిటీషన్లను ఆలస్యంగా దాఖల చేశారని మండిపడ్డారు. అగ్నితో చెలగాటమాడుతున్నారని, జాగ్రత్తగా ఉండాలని న్యాయస్థానం సింగ్‌ను హెచ్చరించింది. ఎవరు తప్పిదం చేసినా పరిణామాలు ఎలా ఉంటాయే మీకు తెలుసుకదా అని వ్యాఖ్యానించింది.
నిర్భయ దోషుల ఉరి అంశం ఇప్పుడు దిల్లీ ప్రభుత్వం చేతిలో ఉందని, జడ్జికి ఇప్పుడు ఎలాంటి పాత్ర లేదని తిహార్ జైలు అధికారులు వాదనల సమయంలో కోర్టుకు తెలియజేశారు.
16:06 March 02
క్షమాభిక్ష తిరస్కరణ
- నిర్భయ దోషి పవన్‌కుమార్ గుప్తా క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరించిన రాష్ట్రపతి
- ఈ ఉదయమే క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేసిన పవన్ గుప్తా
- నలుగురు నిర్భయ దోషులకు ముగిసిన న్యాయపరమైన అవకాశాలు
- కాసేపట్లో పవన్ గుప్తా పిటిషన్‌పై తీర్పు ఇవ్వనున్న పటియాలా హౌస్ కోర్టు
- డెత్‌వారెంట్లపై స్టే ఇవ్వాలని పటియాలా హౌస్ కోర్టులో పిటిషన్ వేసిన పవన్
11:12 March 02
నిర్భయ దోషి పవన్ 'క్యురేటివ్' పిటిషన్ కొట్టివేత
నిర్భయ కేసులో నాలుగో దోషి పవన్ గుప్తా వేసిన క్యురేటివ్ పిటిషన్‌ను కొట్టివేసింది సుప్రీం కోర్టు. తనకు విధించిన మరణశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలని, ఉరి శిక్ష అమలును ఆపాలని కోరుతూ పవన్ కుమార్ గుప్తా పిటిషన్లో పేర్కొన్నాడు. శిక్షను పునఃపరిశీలించాల్సిన అవసరం లేదని, ఉరిశిక్ష అమలుపై స్టే విధించలేమని జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తేల్చిచెప్పింది.
నిర్భయ దోషులు ముకేశ్, వినయ్, అక్షయ్ ఇదివరకే క్షమాభిక్ష పిటిషన్లు దాఖలు చేయగా రాష్ట్రపతి తిరస్కరించారు. దీనిని సవాలుచేస్తూ ముకేశ్, వినయ్‌లు సుప్రీం కోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిని కొట్టివేసింది అత్యున్నత న్యాయస్థానం. వీరిరువురూ తమ న్యాయపరమైన అవకాశాలన్నీ వినియోగించుకున్నారు.
ఇంకా అక్షయ్‌కు క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణను సవాల్ చేసే అవకాశముంది. పవన్ గుప్తా ఇంకా క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేయలేదు. ఈ నేపథ్యంలో మార్చి 3న నిర్భయ దోషుల ఉరి శిక్ష అమలుపై మరోసారి సందిగ్ధం నెలకొంది. అలాగే ఉరి అమలుపై స్టే కోరుతూ పవన్‌తో కలిసి ట్రయల్ కోర్టును ఆశ్రయించాడు మరో దోషి అక్షయ్.