తెలంగాణ

telangana

ETV Bharat / bharat

డెత్​ వారెంట్​పై స్టే కోరుతూ 'నిర్భయ' దోషుల పిటిషన్​ - నిర్భయ కేసు దోషి అక్షయ్

నిర్భయ కేసు దోషులు అక్షయ్ సింగ్, పవన్​కుమార్​ గుప్తా డెత్​ వారెంట్​పై స్టే కోరుతూ దిల్లీ కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు అదనపు సెషన్స్‌ జడ్జి ధర్మేందర్‌ రానా తిహార్​ జైలు అధికారులకు నోటీసులు జారీచేశారు. వచ్చేనెల రెండులోపు దోషుల పిటిషన్లపై కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించారు.

2012 Delhi gang rape case convicts
నిర్భయ కేసు: మరోసారి క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేసిన అక్షయ్​

By

Published : Feb 29, 2020, 4:42 PM IST

Updated : Mar 2, 2020, 11:24 PM IST

డెత్‌ వారెంట్‌ పై స్టే కోరుతూ నిర్భయ దోషులు అక్షయ్‌ సింగ్‌, పవన్‌ కుమార్‌ గుప్తా దిల్లీ కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు అదనపు సెషన్స్‌ జడ్జి ధర్మేందర్‌ రానా...తిహార్​ జైలు అధికారులకు నోటీసులు జారీచేశారు. వచ్చేనెల రెండులోపు దోషుల పిటిషన్లపై కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించారు.

అక్షయ్‌ సింగ్‌ తాజాగా తాను దాఖలుచేసిన క్షమాభిక్ష పిటిషన్‌ పెండింగ్‌లో ఉన్నందున డెత్‌ వారెంట్‌పై స్టే ఇవ్వాలని పిటిషన్‌లో కోరాడు. గతంలో తిరస్కరణకు గురైన తన క్షమాభిక్ష పిటిషన్లో కొన్ని వాస్తవాలు పేర్కొననందున... మళ్లీ దాఖలు చేస్తున్నట్లు అక్షయ్‌ పేర్కొన్నాడు.

మరో దోషి పవన్‌కుమార్‌ గుప్తా... తాను దాఖలు చేసిన క్యూరేటివ్‌ పిటిషన్‌ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున... మరణశిక్ష అమలుపై స్టే ఇవ్వాలని కోరాడు. తనకు విధించిన ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలని క్యూరేటివ్‌ పిటిషన్‌ వేశాడు.

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం... పవన్‌ కుమార్‌ వేసిన క్యూరేటివ్‌ పిటిషన్‌పై సోమవారం విచారణ జరపనుంది. వచ్చేనెల 3న ఉదయం 6గంటలకు నలుగురు దోషులను ఉరితీయాలని దిల్లీ కోర్టు మూడోసారి డెత్‌ వారెంట్‌ జారీచేసింది.

ఇదీ చూడండి:ఆసియాలోనే అత్యంత ధనవంతుడు ముకేశ్ అంబానీ

Last Updated : Mar 2, 2020, 11:24 PM IST

ABOUT THE AUTHOR

...view details