తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'లాక్​డౌన్​'కు తూట్లు.. గుమికూడిన వేలాది మంది!

కరోనా భయాలు వెంటాడుతున్న వేళ... భౌతిక దూరం నిబంధనలకు తిలోదకాలు ఇచ్చిన ఘటన కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో శనివారం జరిగింది. జిల్లా ఇన్​ఛార్జ్ మంత్రి​ ఆనంద్​ సింగ్...​ హోస్పెట్​ తాలూకాలోని కరిగనూరు గ్రామంలో రేషన్​ సరకులు పంపిణీ చేశారు. దీనితో వేలాది మంది ప్రజలు ఒక్కసారిగా అక్కడ గుమిగూడారు.

2000 people are attended for Ration given by Anand Sing in Bellary
'లాక్​డౌన్​'కు తూట్లు.. గుమికూడిన వేలాది మంది!

By

Published : Apr 19, 2020, 6:43 AM IST

లాక్​డౌన్​ మార్గదర్శకాలకు తూట్లు పొడుస్తూ వేలాది మంది ఒకే చోట గుమిగూడిన ఘటన కర్ణాటక బళ్లారి జిల్లాలో చోటుచేసుకుంది.

'లాక్​డౌన్​'కు తూట్లు.. గుమికూడిన వేలాది మంది!

రేషన్​ కోసం

బళ్లారి జిల్లా ఇన్​ఛార్జ్ మంత్రి​ ఆనంద్​ సింగ్...​ హోస్పెట్​ తాలూకాలోని కరిగనూరు గ్రామం, వార్డ్ నెం.23లో రేషన్​ సరకులు పంపిణీ చేపట్టారు. దీనితో సుమారు 2 వేల మంది స్థానికులు ఒక్కసారిగా ఆ ప్రాంగణంలోకి చొరబడ్డారు.

కరోనా వైరస్ భయాలు వెంటాడుతున్నప్పటికీ... స్థానికులు ఏ మాత్రం భౌతిక దూరం నిబంధనలు పాటించలేదు. అప్రమత్తమైన పోలీసులు ప్రజలను భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఈ పరిస్థితుల్లోనే మంత్రి ఆనంద్ సింగ్... బీపీఎల్​, అంత్యోదయ స్కీమ్ కార్డుదారులకు ​రేషన్ సరకులు అందించారు.

ఇదీ చూడండి:దేశంలోని పరిస్థితులపై కాంగ్రెస్​ 'సలహా కమిటీ'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details