తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒడిశాలో 2000 కిలోల గంజాయి పట్టివేత - 2000 కిలోల గంజాయి పట్టివేత

మాదకద్రవ్యాలను కట్టడి చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నా, కార్యకలాపాలు జరుగుతూనే ఉన్నాయి. ఈసారి పెద్ద మొత్తంలో గంజాయి పట్టుకున్నారు. ఒకటి కాదు పది కాదు ఏకంగా 2000 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన ఒడిశాలోని రాయగడలో జరిగింది.

ganja, odisha, police seized 2000kg ganja
ఒడిశాలో 2000 కిలోల గంజాయి పట్టివేత

By

Published : Jan 6, 2021, 10:25 PM IST

ఒడిశాలోని రాయగడలో రెండు వేల కిలోల గంజాయిని ప్రత్యేక కార్య దళం (ఎస్​టీఎఫ్) స్వాధీనం చేసుకుంది. ఇటీవల కాలంలో ఇదే అతిపెద్ద మొత్తం అని ఎస్​టీఎఫ్ తెలిపింది.

2000 కిలోల గంజాయి సీజ్​

ఆకస్మిక తనిఖీ

మునిగుడా ప్రాంతలోని త్రికర్ పాడ హరిజన్​ సాహి వద్ద ఉన్న రహదారిపై ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ క్రమంలో మాదకద్రవ్యాలు తరలిస్తున్న లారీ పట్టుబడింది. నిందితులను గుర్తించామని, త్వరలో అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్​స్టెన్సెస్​ చట్టం కింద కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి :'నాపై విష ప్రయోగానికి కారణం ఇదే!'

ABOUT THE AUTHOR

...view details