ఈ ఏడాది అక్టోబర్ వరకు జమ్ముకశ్మీర్‌లో వివిధ ఉగ్రసంస్థలకు చెందిన 200 మంది ఉగ్రవాదులను భద్రతాదళాలు మట్టుబెట్టాయి. వీరిలో అత్యధికులు హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థకు చెందిన వారే ఉన్నారు. తాజాగా సోమవారం జరిగిన శ్రీనగర్ ఎన్‌కౌంటర్‌లో హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సైఫ్ ఉల్ ఇస్లాం మిర్ కూడా హతమయ్యాడు.
ఈ మేరకు ఎన్‌కౌంటర్ల గణాంకాలను భద్రతా దళాలు వెల్లడించాయి. ఈ ఏడాది జూన్‌లో అత్యధికంగా 49 మంది ముష్కరులను హతమార్చినట్లు తెలిపాయి. ఒక్క నెలలో ఇంత మంది ఉగ్రవాదులను చంపడం ఇదే అత్యధికం. దక్షిణ కశ్మీర్‌లోనే 138 మంది ముష్కరులను మట్టుబెట్టినట్లు పేర్కొన్నాయి.