ప్రయాణికుల కోసం అదనంగా 200 ప్రత్యేక రైళ్లను సోమవారం నుంచి ప్రారంభిస్తున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. తొలిరోజు వీటిలో 1.45 లక్షల మందికిపైగా ప్రయాణించవచ్చని అంచనా వేసింది. అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్(ఏఆర్పీ) ద్వారా దాదాపు 26 లక్షల మంది జూన్ 1 నుంచి జూన్ 30 వరకు టికెట్లు బుక్ చేసుకున్నారని పేర్కొంది.
సోమవారం నుంచి మరో 200 ప్రత్యేక రైళ్లు - 200 special trains from june 1st
సోమవారం నుంచి 200 ప్రత్యేక రైళ్ల సేవలను ప్రారంభించనున్నట్లు తెలిపింది రైల్వే శాఖ. వీటిలో మొదటి రోజు 1.45 లక్షల మందికిపైగా ప్రయాణిస్తారని అంచనా వేసింది.
ప్రయాణికుల కోసం అదనంగా 200 ప్రత్యేక రైళ్లు
ఇప్పటికే నడుస్తున్న శ్రామిక్ రైళ్లు, 30 ఏసీ ప్రత్యేక రైళ్లకు ఇవి అదనమని రైల్వే శాఖ స్పష్టం చేసింది. స్టేషన్‌కు 90 నిమిషాల ముందుగానే ప్రయాణికులు చేరుకోవాలని, టికెట్ బుక్ చేసుకున్న వారినే ప్లాట్‌ఫాం పైకి అనుమతిస్తామని తెలిపింది.
కేంద్ర హోంశాఖ మార్గదర్శకాల మేరకు ప్రయాణీకులంతా కచ్చితంగా మాస్కులు ధరించాలి. స్క్రీనింగ్ నిర్వహించాక కరోనా లక్షణాలు లేని వారిని మాత్రమే బోర్డింగ్‌కు అనుమతిస్తారు.