ఉత్తరప్రదేశ్ కన్నౌజ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. మృతులకు సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
''చాలామంది ఈ ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకున్నారు. వారందరికీ నా సంతాపం ప్రకటిస్తున్నా. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా.''
-నరేంద్ర మోదీ, ప్రధాని
ఈ దుర్ఘటనపై... కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. ఈ వార్త తనను తీవ్రంగా కలచివేసిందన్నారు.
''కన్నౌజ్ రోడ్డు ప్రమాదంలో 20 మందికిపైగా చనిపోయారని తెలియగానే చాలా బాధేసింది. చాలామంది గాయపడ్డారని విన్నాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలి.''