యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది సజీవదహనం ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేటు బస్సు, ట్రక్కు ఢీ కొనడం వల్ల పెద్ద ఎత్తున మంటలు చెలరేగి ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు తెలిపారు.
బస్సులో మంటలు చెలరేగగానే వీరిలో అనేక మంది బయటకు దూకి ప్రాణాలు రక్షించుకున్నారు. ఈ ఘటనలో మరో 21 మంది గాయపడ్డారు.
మోదీ దిగ్భ్రాంతి..
ఉత్తర్‌ప్రదేశ్ బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
పరిహారం ప్రకటన
ఈ ప్రమాదంపై ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తరో రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి:కారు నుంచి రోడ్డుపై పడిన చిన్నారి..తప్పిన ప్రమాదం