తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బంగాల్​లో పోలీసులపై దాడి- 20 మందికి గాయాలు - కరోనా మృతి

బంగాల్​లో పోలీసులకు చేదు అనుభవం ఎదురైంది. కరోనా సోకి మరణించిన వ్యక్తి మృతదేహాన్ని రహస్యంగా ఖననం చేస్తున్నారనే అనుమానంతో స్థానికులు.. పోలీసులతో ఘర్షణకు దిగారు. ఈ గొడవలో 20 మంది పోలీసులు గాయపడ్డారు.

20 Bengal Cops Injured In Clash With Locals Over COVID-19 Victim's Burial
కరోనా మృతదేహాన్ని పారేస్తున్నారంటూ పోలీసులపై దాడి!

By

Published : Apr 21, 2020, 4:34 PM IST

కరోనాపై ప్రజల్లో అపోహలు, అనుమానాలు ఎక్కువవుతున్నాయి. బంగాల్​లో అలాంటి అనుమానమే పోలీసులపై స్థానికులు దాడి చేసేలా చేసింది. కరోనాతో మరణించిన వ్యక్తి మృతదేహాన్ని రహస్యంగా ఖననం చేస్తున్నారనే ఆరోపణతో ఆలిపురుద్వార్​​ జిల్లాలో పోలీసులతో ఘర్షణకు దిగారు స్థానికులు. ఈ ఘటనలో 20 మంది పోలీసులు గాయపడ్డారు.

బంగాల్​లో పోలీసులపై దాడి

ఏం జరిగిందంటే?

బంగాల్​ ఆలిపురుద్వార్​​ జిల్లాలో ఓ మృతదేహాన్ని పోలీసులు రహస్యంగా ఖననం చేస్తున్నారని స్థానికులు ఆరోపించారు. సల్కుమార్​హాట్​ ప్రాంతంలోని తీస్తా నది తీరాన పోలీసులతో ఘర్ణణకు దిగారు. పోలీసుల వాహనాలను ధ్వంసం చేశారు. ఈ దాడిలో 20 మంది పోలీసులకు గాయాలైనట్లు అధికారులు తెలిపారు.

అయితే కరోనాతో మృతి చెందిన వ్యక్తి మృతదేహాన్ని అర్ధరాత్రి సమయంలో రహస్యంగా పూడ్చేందుకు పోలీసు బృందం వచ్చిందని.. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించామని స్థానికులు చెప్పారు. ఆ సమయంలో పోలీసులు తమపై కాల్పులు జరిపారని ఓ యువకుడు గాయపడ్డాడని వెల్లడించారు.

బంగాల్​లో పోలీసులపై దాడి

పోలీసు వాహనాలు ధ్వంసం
పోలీసు వాహనాలు ధ్వంసం
పోలీసు వాహనాలు ధ్వంసం

ఇదీ చదవండి:ఫేస్​బుక్​ నుంచి త్వరలో ఉచిత గేమింగ్​ యాప్!

ABOUT THE AUTHOR

...view details