సాధారణంగా ఎవరైనా ఆకతాయిలు ఏడిపిస్తే అమ్మాయిలు పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. లేదంటే ఇంట్లోవారికి చెబుతారు. ఒడిశా భువనేశ్వర్‌లో ఓ యువతి మాత్రం వారికి అక్కడికక్కడే తగిన బుద్ధి చెప్పింది.
ఆకతాయిలతో నడిరోడ్డుపై గుంజీలు తీయించిన యువతి
తనను అభ్యంతరకర మాటలు అన్నందుకు ఓ యువతి ఇద్దరు కుర్రాళ్లకు నడిరోడ్డుపైనే బుద్ధి చెప్పింది. ఆకతాయిలకు రెండు లెంపకాయలు పీకి.. గుంజీలు తీయించింది. ఒడిశా భువనేశ్వర్‌లో జరిగిన ఈ ఘటన నెట్టింట విపరీతంగా వైరల్ అయింది.
జగన్నాథ్ ప్రాంతంలోని బొమిఖల్లో బెబినా మహాలకి అనే యువతి స్కూటర్‌పై వెళ్తుండగా... ఇద్దరు ఆకతాయిలు వెంటపడ్డారు. ఆమెను చూసి అభ్యంతరకరంగా మాట్లాడారు. బెబినా వెంటనే వారి ద్విచక్రవాహనాన్ని ఆపి.. ఇద్దరిని లాగి చెంపదెబ్బ కొట్టింది. అంతేనా.. అందరూ చూస్తుండగా.. వారిని నడిరోడ్డుపై గుంజీలు తీయించింది. అనంతరం పోలీసులు ఆ ఇద్దరు కుర్రాళ్లను అదుపులోకి తీసుకున్నారు.
స్థానికులు తీసిన ఈ వీడియో నెట్టింట విపరీతంగా చక్కర్లు కొడుతోంది. బెబినా చూపిన ధైర్యానికి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
- ఇదీ చూడండి: మొహర్రం దృష్ట్యా కశ్మీర్లో మళ్లీ ఆంక్షలు..!