తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పుల్వామా దాడి పాత్రధారులు హతం - JK ENCOUNTER

జమ్ముకశ్మీర్​ అనంత్​నాగ్​లో ఈరోజు ఉదయం జరిగిన ఎన్​కౌంటర్​లో భద్రతాదళాలు మట్టుబెట్టిన ఇద్దరిని జైషే మహ్మద్​ ఉగ్రవాదులుగా గుర్తించారు. ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా దాడిలో వీళ్లు కీలక పాత్ర పోషించినట్లు ధ్రువీకరించారు.

ఇద్దరు జైషే ఉగ్రవాదుల హతం

By

Published : Jun 18, 2019, 1:59 PM IST

ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా బాంబు దాడి ఘటనతో సంబంధమున్న ఇద్దరు జైషే మహ్మద్​(జేఈఎం) ఉగ్రవాదులు హతమయ్యారు. జమ్ముకశ్మీర్​ అనంత్​నాగ్​లో జరిగిన​ ఎన్​కౌంటర్​లో వీళ్లను మట్టుబెట్టినట్టు అధికారులు తెలిపారు. వీరిని సజ్జద్​ మక్బూల్​ భట్​, తౌసీఫ్​లుగా ధ్రువీకరించారు.

ముష్కురులు తలదాచుకున్నారన్న సమాచారంతో మంగళవారం ఉదయం జమ్ముకశ్మీర్​ అనంత్​నాగ్ బిజ్​బిహార్​లో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. వీరిని పసిగట్టిన ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడటం ఎన్​కౌంటర్​కు దారితీసింది. తీవ్రంగా ప్రతిఘటించిన బలగాలు ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఒక జవాను ప్రాణాలు కోల్పోయాడు.

ఇదీ చూడండి: బిహార్​: వడదెబ్బకు 3 రోజుల్లో 76 మంది బలి

ABOUT THE AUTHOR

...view details