నియంత్రణ రేఖ వెంబడి మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది పాక్. కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా నౌగామ్ సెక్టార్ వద్ద పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లు అమరులయ్యారు. మరో నలుగురు గాయపడ్డారని అధికారులు తెలిపారు.
పాక్ దుశ్చర్యకు మరో ఇద్దరు భారత జవాన్లు బలి - India-pak border
పాకిస్థాన్ సైన్యం మరోసారి వక్రబుద్ధిని ప్రదర్శించింది. జమ్ముకశ్మీర్ నౌగామ్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వద్ద దాడులకు తెగబడి ఇద్దరు భారత జవాన్లను బలిగొంది.

పాక్ దుశ్చర్యకు మరో ఇద్దరు భారత జవాన్లు బలి
భారత సైన్యం లక్ష్యంగా మోర్టార్ షెల్స్‌ను పాక్ ప్రయోగించినట్లు అధికారులు చెప్పారు. భారత్ సైన్యం దీటుగా జవాబిచ్చిందని తెలిపారు.
ఇదీ చూడండి:భారత్ చేరనున్న వీవీఐపీ విమానం 'బోయింగ్ 777'