రాజస్థాన్ శ్రీగంగానగర్ జిల్లాలో గజ్సింహపుర్ సెక్టార్ వద్ద దేశంలోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించిన పాక్కు చెందిన ఇద్దరు వ్యక్తులను మట్టుబెట్టాయి భద్రత దళాలు. వారి నుంచి ఓ తుపాకీ, హెరాయిన్ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
పాక్ సరిహద్దుల్లో ఇద్దరు చొరబాటుదారులు హతం - Pak intruders killed news
రాజస్థాన్లో సరిహద్దులు దాటి దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించిన ఇద్దరు పాక్ పౌరులను హతమార్చాయి భారత భద్రతా బలగాలు.
భారత్-పాక్ సరిహద్దుల్లో ఇద్దరు చొరబాటుదారులు హతం
అంతర్జాతీయ సరిహద్దుల్లో సైన్యం కళ్లు కప్పి దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నించగా వారిపై కాల్పులు జరిపినట్లు అధికారులు వెల్లడించారు. బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు తెలిపారు.
ఇదీ చూడండి:ఆటో డ్రైవర్గా మారిన డాక్టర్.. కారణమిదే...