ఛత్తీస్‌గడ్‌లోని కాంకేర్ జిల్లాలో ఇద్దరు మావోయిస్టులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. కాంకేర్ జిల్లా అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో భద్రతా బలగాలకు మాలెపరా, ముర్నూర్ గ్రామాల మధ్య మావోయిస్టులు తారసపడ్డారు.
ఛత్తీస్‌గఢ్‌లో కాల్పులు- ఇద్దరు నక్సల్స్ హతం - హతం
ఛత్తీస్‌గఢ్ కాంకేర్ జిల్లాలో భద్రతా దళాలకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇద్దరు మావోలను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఘటనా స్థలం నుంచి పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి భద్రతా దళాలు.
ఛత్తీస్‌గఢ్‌లో కాల్పులు- ఇద్దరు మావోలు హతం
భద్రతా దళాలను చూసిన మావోలు కాల్పులకు తెగబడ్డారు. భద్రతా దళాలు దీటుగా బదులివ్వడం వల్ల మావోలు పారిపోయినట్లు డీజీపీ తెలిపారు. అనంతరం అటవీ ప్రాంతంలో గాలించిన భద్రతా బలగాలు ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను గుర్తించాయి. రెండు ఎస్ఎల్ఆర్ రైఫిళ్లు, ఇతర ఆయుధాలను ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నాయి.
- ఇదీ చూడండి: అప్పు కట్టలేదని మహిళపై అమానుషం