తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లంక దాడి: 10కి భారతీయ మృతుల సంఖ్య

శ్రీలంక మారణహోమంలో 10 మంది భారతీయులు మరణించారని మంగళవారం కొలంబోలోని భారత రాయబార కార్యాలయం అధికారికంగా ప్రకటించింది.

శ్రీలంక ఉగ్రదాడిలో 10కి భారతీయ మృతుల సంఖ్య

By

Published : Apr 23, 2019, 4:33 PM IST

Updated : Apr 23, 2019, 5:15 PM IST

లంక దాడి: 10కి భారతీయ మృతుల సంఖ్య

శ్రీలంక మారణహోమంలో మృతి చెందిన భారతీయుల సంఖ్య 10కి చేరింది. ఈ విషయాన్ని మంగళవారం కొలంబోలోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది.

ఆదివారం ఈస్టర్ పర్వదినాన చర్చ్​లు, హోటళ్లను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు వరుస బాంబు పేలుళ్లలకు పాల్పడ్డారు. ఈ దాడిలో సుమారు 321 మంది ప్రాణాలు కోల్పోయారు. 500 మంది వరకు గాయపడ్డారు. వీరిలో 8 మంది భారతీయులు ఉన్నట్లు ముందుగా ప్రకటించారు. అయితే మరో ఇద్దరు భారతీయలు కూడా మరణించారని తాజాగా గుర్తించారు.

"శ్రీలంక పేలుళ్లలో మరో ఇద్దరు భారతీయులు మరణించారని నిర్ధరిస్తున్నందుకు చింతిస్తున్నాము. ఆదివారం జరిగిన బాంబు దాడుల్లో ఏ మారెగౌడ, హెచ్​ పుట్టరాజు మరణించారు. వీరితో మొత్తం ఇప్పటివరకు మరణించిన భారతీయుల సంఖ్య 10కి చేరుకుంది." - భారత రాయబార కార్యాలయం

ఉగ్రదాడులకు బలైన వారిలో కర్ణాటకకు చెందిన జనతాదళ్ (సెక్యులర్​) కార్యకర్తలు ఆరుగురు ఉన్నారు. మరో జనతాదళ్ కార్యకర్త ఆచూకీ దొరకలేదు.

జాతీయ సంతాపదినం..

ఆదివారం ఈస్టర్ వేడుకల వేళ నేషనల్​ తౌవీద్​ జమాత్​ (ఎన్​టీజే) వరుస బాంబుదాడులకు, ఆత్మాహుతి దాడులకు పాల్పడినట్లు భావిస్తున్నారు. ఉగ్రదాడుల్లో అసువులు బాసినవారి కోసం ఇవాళ శ్రీలంక ప్రభుత్వం సంతాప దినంగా ప్రకటించింది. జాతీయ పతాకాన్ని అవనతం చేసింది. దేశ ప్రజలంతా మూడు నిమిషాలు మౌనం పాటించి మృతులకు అశ్రునివాళి అర్పించారు.

ఇదీ చూడండి: 'న్యూజిలాండ్​ దాడికి శ్రీలంకలో ప్రతీకారం'

Last Updated : Apr 23, 2019, 5:15 PM IST

ABOUT THE AUTHOR

...view details