జమ్ము కశ్మీర్‌లో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. అవంతిపుర పట్టణంలో ఉగ్రవాద కదలికలున్నాయన్న నిఘా వర్గాల సమాచారంతో పోలీసులు, భద్రతా బలగాలు నిర్భంద తనిఖీలు చేపట్టారు. సైనికుల కదలికల్ని పసిగట్టిన ముష్కరులు కాల్పులకు తెగబడగా తిప్పికొట్టిన జవాన్లు ఎదురు కాల్పులు జరిపారు. ఘటనాస్థలంలో భారీగా తుపాకులు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. మరికొంత మంది ఉగ్రవాదులు ఉండొచ్చనే అనుమానాలతో బలగాలు గాలింపు చర్యలు చేపట్టారు.
కశ్మీర్‌లో ఇద్దరు లష్కరే తోయిబా ముష్కరులు హతం - ceasefire
జమ్ముకశ్మీర్లో ఇద్దరు లష్కరే తోయిబా తీవ్రవాదులను మట్టుబెట్టింది భారత సైన్యం. అవంతిపుర ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో వీరు ఇరువురినీ హతమార్చారు.
కాల్పల్లో ఇద్దరు ఉన్మాదులను మట్టుబెట్టిన సైన్యం