తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వేట ముమ్మరం

జమ్ముకశ్మీర్​లో 3 రోజులుగా కొనసాగుతున్న ఎన్​కౌంటర్​లో ఇప్పటివరకు ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. ఐదుగురు భద్రతా సిబ్బంది, ఒక స్థానికుడు మరణించారు. ఇంకా కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి.

జమ్ముకశ్మీర్​లో 3 రోజులుగా కొనసాగుతున్న ఎన్​కౌంటర్

By

Published : Mar 3, 2019, 4:41 PM IST

జమ్ముకశ్మీర్​లో 3 రోజులుగా కొనసాగుతున్న ఎన్​కౌంటర్

జమ్ముకశ్మీర్​ కుప్వారా జిల్లాలో దాదాపు 60 గంటలుగా కొనసాగుతున్న ఎదురుకాల్పుల్లో ఇద్దరు తీవ్రవాదులు హతమయ్యారు. బాబాగంద్​ గ్రామంలో ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు శుక్రవారం తనిఖీలు నిర్వహించాయి. ఈ సమయంలో ఇరు వర్గాల మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయి.

ఎదురుకాల్పుల్లో ఇప్పటివరకు ఇద్దరు తీవ్రవాదులు, ముగ్గురు సీఆర్​పీఎఫ్​ జవాన్లు, ఇద్దరు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఘటనాస్థలం నుంచి ఉగ్రవాదుల ఆయుధాలు, పేలుడు పదార్థాలు, ఇతర ఆధారాలు భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.

ఎన్​కౌంటర్​ సమయంలో కొందరు స్థానిక యువకులు భద్రతా సిబ్బందితో ఘర్షణపడ్డారు. వారిని అదుపు చేసేందుకు జరిపిన కాల్పుల్లో ఒక పౌరుడు మరణించాడు.

ప్రస్తుతానికి ఉగ్రవాదులు ఓ ఇంట్లో ఉండి కాల్పులు కొనసాగిస్తున్నారు. భద్రతా సిబ్బంది చుట్టుపక్కల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ముష్కరుల పనిబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details