తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం - ద్దరు ఉగ్రవాదులు, జవాను మృతి

జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదులు మరోమారు రెచ్చిపోయారు.  సైనికులపై కాల్పులు జరపగా దీటుగా సమాధానం ఇచ్చింది భారత సైన్యం. ఈ ఘటనలో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. ఓ సీఆర్​పీఎఫ్​ జవాను ప్రాణాలు కోల్పోయాడు.

jk_
ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు, జవాను మృతి

By

Published : Feb 5, 2020, 1:20 PM IST

Updated : Feb 29, 2020, 6:37 AM IST

జమ్ముకశ్మీర్​లో మరోసారి కాల్పుల మోత మోగింది. శ్రీనగర్​లోని పరీం పొరా ప్రాంతం వద్ద భద్రతబలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. తొలుత ముష్కరులు సైన్యంపై దాడులకు పాల్పడగా భారత సైనికులు దీటుగా తిప్పికొట్టారు.

ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఓ భారత సీఆర్​పీఎఫ్​ జవానూ ప్రాణాలు కోల్పోయాడు. మరో ఉగ్రవాదినీ ప్రాణాలతో పట్టుకున్నట్లు సమాచారం. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చూడండి: 200 అడుగుల హైవోల్టేజ్​ టవర్​పైనుంచి జంప్​!

Last Updated : Feb 29, 2020, 6:37 AM IST

ABOUT THE AUTHOR

...view details