తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అసోం, మహారాష్ట్రలో భూప్రకంపనలు - Earthquake latest news

అసోంలో స్వల్ప వ్యవధిలో రెండు భూకంపాలు సంభవించాయి. రిక్టరు స్కేలుపై 4.4 తీవ్రత నమోదైంది. అయితే ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. మహారాష్ట్రలోనూ స్వల్పంగా భూమి కంపించింది.

2 medium-intensity earthquakes jolt Assam
అసోంలో భూకంపం- 4.4 తీవ్రత నమోదు

By

Published : Sep 22, 2020, 11:06 AM IST

అసోంలో రెండు వేర్వేరు చోట్ల భూమి కంపించింది. గువాహటికి పశ్చిమాన భూకంపం సంభవించగా.. రిక్టర్​ స్కేలుపై 4.4 తీవ్రత నమోదైంది. బర్పేట్​ జిల్లాలోనూ భూమి స్వల్పంగా కంపించింది. భూకంప లేఖినిపై 4.2తీవ్రతగా రికార్డు అయింది. అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

మహాలోనూ భూకంపం..

మహారాష్ట్ర పాల్ఘర్​ జిల్లాలో భూమి స్వల్పంగా కంపించింది. రిక్టర్ స్కేలుపై 3.5 తీవ్రతగా నమోదైంది. వరుస భూప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

ఇదీ చూడండి:ఒక్కరోజులో 75,083 కరోనా కేసులు, 1053 మరణాలు

ABOUT THE AUTHOR

...view details