పంజాబ్‌లోని తరన్ తరన్ జిల్లాలో ఓ ఊరేగింపులో అపశ్రుతి చోటు చేసుకుంది. బాణాసంచా ఉంచిన ట్రాక్టర్‌లో పొరపాటున నిప్పురవ్వలు పడి పేలుడు సంభవించింది.
ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. పాహు గ్రామంలో నగర్ కీర్తన్ పేరిట ఊరేగింపు నిర్వహిస్తున్నసమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ఊరేగింపు కోసం ట్రాక్టర్‌లో బాణాసంచా తీసుకువస్తుండగా ప్రమాదవశాత్తూ పేలింది. పేలుడుతో ఊరేగింపులో పాల్గొన్న భక్తులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. ట్రాక్టర్ తునాతునకలైంది.
క్షతగాత్రులను వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
స్థానికుల సమాచారం మేరకు..