నిర్మాణంలో ఉన్న వంతెన కూలి ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన బంగాల్ మాల్దా జిల్లా వైష్ణవ్నగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. మరో ఏడుగురు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. క్షతగాత్రుల్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
బంగాల్లో కూలిన వంతెన.. ఇద్దరు మృతి - బంగాల్లో కూలిన వంతెన
బంగాల్ మాల్దా జిల్లాలోని వైష్ణవ్నగర్లో దారుణం జరిగింది. నిర్మాణంలో ఉన్న వంతెన కూలి ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఏడుగురికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు.
బంగాల్లో కూలిన వంతెన.. ఇద్దరు మృతి
రాత్రి 8 గంటల సమయంలో ఈ ఫరక్కా వంతెన కూలినట్లు అధికారులు పేర్కొన్నారు. శిథిలాల కింద మరికొందరు కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు.
Last Updated : Mar 1, 2020, 2:05 PM IST