తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పెళ్లిలో నవ్వులు పూయించిన బహుమతి.. ఇంతకీ ఏమిటది?

పెళ్లిలో స్నేహితులు ఇచ్చిన బహుమతి మంటపంలో నవ్వులు పూయించింది. గిఫ్ట్​ తెరిచి చూసిన నవ దంపతులు అవాక్కయ్యారు. ఇంతకీ ఏమిటనుకుంటున్నారా.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా తన గురించే చెప్పుకుంటున్నారు.. అదేనండి ఉల్లిపాయలు. 2 కిలోల ఉల్లి బహుమతిగా ఇచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన ఈ ఘటన బంగాల్​లో జరిగింది.

onion gift
పెళ్లిలో నవ్వులు పూయించిన బహుమతి

By

Published : Dec 7, 2019, 8:57 PM IST

Updated : Dec 7, 2019, 11:57 PM IST

ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో.. ధరల పెరుగుదలపై పలు రూపాల్లో ప్రజలు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కొంత మంది బంగారంతో పోలిక పెట్టి సెటైర్లు వేస్తుంటే.. మరికొందరు బహుమతుల రూపంలో ఉల్లిని గేలి చేస్తున్నారు.

పెళ్లిలో నవ్వులు పూయించిన బహుమతి

తాజాగా బంగాల్‌కు చెందిన ఓ వివాహ శుభకార్యంలో ఉల్లి.. పెళ్లి బహుమతిగా మారింది. కిలో 150 రూపాయల చొప్పున కొనుగోలు చేసిన 2కేజీల ఉల్లిగడ్డలను ఆ యువజంటకు స్నేహితులు బహుమతిగా అందించారు. ఈ విషయం తెలియని ఆ కొత్త జంట గిప్ట్‌ తెరవగానే.. ఒక్కసారిగా అవాక్కయ్యారు. పెళ్లివాకిట్లో నవ్వులు విరబూశాయి.

ఇదీ చూడండి: పేదలకు అందనంత ఎత్తుకు 'న్యాయ వ్యవస్థ' : రాష్ట్రపతి

Last Updated : Dec 7, 2019, 11:57 PM IST

ABOUT THE AUTHOR

...view details