ఒక్క పుట్టగొడుగు మహా అయితే 50 గ్రాముల బరువు ఉంటుంది. కానీ, కేరళలో దాదాపు 2 కిలోల బరువున్న పుట్టగొడుగులు మొలకెత్తి.. అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి.
ఒక్క పుట్టగొడుగు బరువెంతో తెలుసా? - giant mushroom in kerala
కేరళలో విరబూసిన రెండు పుట్టగొడుగులు నెటిజన్ల మనసు దోచేస్తున్నాయి. పుట్టగొడుగులకు అంత ఫాలోయింగ్ ఎందుకని తీసిపారేయకండి.. అవి సాదాసీదా పుట్టగొడుగులు కాదు. ఒక్కోటి రెండు కిలోల బరువు, రెండున్నర అడుగుల వెడల్పు గల భారీ మష్రూమ్స్ మరి!

ఒక్క పుట్టగొడుగు బరువెంతో తెలుసా?
ఒక్క పుట్టగొడుగు బరువెంతో తెలుసా?
ఇడుక్కీ జిల్లా, అదిమలైకు చెందిన కవుమ్తాదతిల్ బేబీ పెరట్లో రెండు పుట్టగొడుగులు మొలకెత్తాయి. ఒక్కో పుట్టగొడుగు దాదాపు 2 కిలోల బరువు, రెండున్నర అడుగుల వెడల్పు ఉండండం గమనార్హం. అందుకే, బేబీ పెరట్లో మొలకెత్తిన అరుదైన పుట్టగొడుగులకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.
ఇదీ చదవండి: ఇంట్లో నీళ్లు ఖతం చేస్తున్న కరోనా!