హరియాణాలోని గురుగ్రామ్‌లో సోహ్న రహదారిపై నిర్మాణంలో ఉన్న వంతెన శనివారం రాత్రి కూలిపోయింది. ఈ ఘటనలో గాయపడ్డ ఇద్దరు కార్మికులను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రాంతంలో రాకపోకలు నిలిపేసినట్లు పోలీసులు తెలిపారు.
భారీ శబ్దంతో కూలిన వంతెన- ఇద్దరికి గాయాలు - flyover collapse in gurgram
గురుగ్రామ్‌లో నిర్మాణంలో ఉన్న ఓ వంతెనలోని భారీ కాంక్రీట్ స్లాబ్ శనివారం రాత్రి ఒక్కసారిగా కూలిపోయింది. ఆ సమయంలో జనసంచారం లేని కారణంగా భారీ ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. గాయపడిన ఇద్దరు కార్మికులను ఆసుపత్రికి తరలించారు పోలీసులు.
వంతెన
రెండు పిల్లర్ల మధ్య ఏర్పాటు చేసిన గిర్డర్లు జరిగిపోవటం వల్ల వంతెనలోని భారీ కాంక్రీట్ స్లాబ్ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ సమయంలో భారీ శబ్దం వచ్చినట్లు స్థానికులు తెలిపారు. ఘటన జరిగినప్పుడు అక్కడ జనసంచారం ఎక్కువగా లేకపోవటంతో భారీ ప్రమాదం తప్పిందన్నారు.