కేరళలోని రెండు ఏనుగుల మృతి ఘటన మరువక ముందే వరుసగా గజరాజులు చనిపోతున్న వార్తలు వస్తున్నాయి. ఛత్తీస్గఢ్లోమూడు రోజుల వ్యవధిలో 3 గజరాజుల మృత దేహాలు లభ్యమయ్యాయి.
గర్భంతో ఒకటి..!
కేరళలోని రెండు ఏనుగుల మృతి ఘటన మరువక ముందే వరుసగా గజరాజులు చనిపోతున్న వార్తలు వస్తున్నాయి. ఛత్తీస్గఢ్లోమూడు రోజుల వ్యవధిలో 3 గజరాజుల మృత దేహాలు లభ్యమయ్యాయి.
గర్భంతో ఒకటి..!
బల్రాంపుర్ జిల్లా రాజ్పుర్ అటవీ ప్రాంతంలో ఓ ఏనుగు మృతదేహాన్ని గుర్తించారు అధికారులు. అంతకుముందు జూన్ 9, 10 తేదీల్లో వరుసగా రెండు గజరాజుల మృత దేహాలు సూరజ్పుర్ జిల్లాలోని ప్రతాప్పుర్ అరణ్యంలో లభ్యమయ్యాయి. ఇందులో ఓ ఏనుగు గర్భంతో ఉంది. ఈ మూడూ ఆడ ఏనుగులుగా గుర్తించారు అటవీ శాఖ సిబ్బంది. పోస్ట్మార్టం నివేదిక ప్రకారం మూడు ఏనుగులు సహజంగా మరణించలేదని.. విషపదార్థాలు తినడం వల్లే మృతి చెందాయని తెలిసింది. కేసు నమోదు చేసిన అధికారులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:అటవీ ఏనుగుల మృతి ఘటనలపై కేంద్రం సీరియస్