తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రూ.10కోట్లు విలువైన మాస్కులు మాయం!

కరోనా వ్యాప్తితో ప్రపంచదేశాలతో పాటు భారత్​లోనూ శానిటైజర్​, మాస్కుల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఇదే సమయంలో రాజస్థాన్​లోని ఓ ఆస్పత్రిలో ఏకంగా రూ.10కోట్ల విలువైన 2.5 లక్షల మాస్కులు మాయం కావడం సంచలనంగా మారింది.

2.5 Lakh masks went missing from SMS hospital, case registered
ఆస్పత్రిలో రూ.10కోట్ల విలువైన మాస్కులు మాయం

By

Published : Mar 23, 2020, 11:48 PM IST

ప్రపంచ దేశాలతో పాటు భారత్​లో కరోనా ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఈ వైరస్​ బారిన పడకుండా మాస్కులు ధరించి, శానిటైజర్లను ఉపయోగించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే వాటి డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. అయితే రాజస్థాన్​ జైపుర్​లోని ఎస్​ఎంఎస్​ ఆస్పత్రిలో ఏకంగా 2.5 లక్షల మాస్కులు కనిపించకుండా పోయాయి. వీటి విలువ సుమారు రూ.10కోట్లు.

ఈ ముసుగులను ఐసోలేషన్​ వార్డుల్లో విధులు నిర్వహిస్తోన్న వైద్యులు, నర్సుల కోసం తెప్పించారు. ఎన్​-95 క్వాలిటీతో తయారు చేసిన ఒక్కో మాస్కు ధర రూ.400. విషయం తెలుసుకున్న ఆస్పత్రి యాజమాన్యం కమిటీ ఏర్పాటు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details