కేరళలోని కోజికోడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 2.3 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. యూఏఈలోని రాస్ అల్ ఖైమాహ్ నుంచి ఎస్జీ-9026 విమానంలో వచ్చిన నలుగురు ప్రయాణికుల నుంచి ఈ బంగారాన్ని పట్టుకున్నారు.
1.8 కేజీల బంగారాన్ని ఓ మహిళ నుంచి, 280, 390, 387 గ్రాముల బంగారాన్ని మరో ముగ్గురు వ్యక్తుల నుంచి స్వాధీనం చేసుకున్నారు.