జమ్ముకశ్మీర్‌లో సీఆర్పీఎఫ్ బలగాలపై జరిగిన గ్రనేడ్ దాడిలో తొమ్మిది మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరు సైనికులు, ఏడుగురు పౌరులున్నారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.
కశ్మీర్ గ్రనేడ్ దాడిలో తొమ్మిది మందికి గాయాలు
జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో సీఆర్పీఎఫ్ సిబ్బందిపై గ్రనేడ్ దాడి జరిగింది. రద్దీగా ఉండే లాల్ చౌక్ ప్రాంతానికి సమీపంలోని ప్రతాప్ పార్క్ వద్ద ఉన్న జవాన్లపై దాడికి తెగబడ్డారు తీవ్రవాదులు. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు, ఏడుగురు పౌరులు గాయపడ్డారు.
సీఆర్పీఎఫ్ బలగాలపై గ్రనేడ్ దాడి... తొమ్మిది మందికి గాయాలు..
ఆదివారం మధ్యాహ్నం శ్రీనగర్ లాల్ చౌక్ ప్రాంతంలోని ప్రతాప్ పార్క్ వద్ద ఒక్కసారిగా గ్రనేడ్ దాడి జరిగింది. అక్కడ ఉన్న జవాన్లే లక్ష్యంగా దాడికి తెగబడ్డారు తీవ్రవాదులు. దీనితో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. అనంతరం లాల్ చౌక్ ప్రాంతాన్ని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.
Last Updated : Feb 28, 2020, 10:01 PM IST
TAGGED:
attack in srinagar