బిహార్‌లోని పట్నా గయా సెక్షన్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. పోటాహి-నద్వాన్ మధ్య రైల్వే ట్రాక్‌ను దాటుతున్న ఓ కారును ట్రైన్ ఢీకొంది. ఈ ఘటనలో కారులోని ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. అయితే రైలు ప్రయాణానికి ఎలాంటి అంతరాయం కలగలేదని భారతీయ రైల్వే తెలిపింది.
రైలు వస్తున్నా కారు పోనిచ్చారు.. ప్రాణాలొదిలారు - కారును ఢీకొన్న రైలు.. ఇద్దరు వ్యక్తులు మృతి
నిర్లక్ష్యం ఇద్దరు వ్యక్తుల ప్రాణాలను బలిగొంది. రైలు వస్తుందని తెలిసి కూడా పట్టాల పైనుంచి కారు పోనిచ్చారు. దీంతో ఆ కారును అతివేగంగా రైలు ఢీకొనగా.. అందులో ఉన్న ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన బిహార్‌లోని పట్నా గయా సెక్షన్ వద్ద జరిగింది.
![రైలు వస్తున్నా కారు పోనిచ్చారు.. ప్రాణాలొదిలారు 2 car passengers killed after a car which was illegally crossing the railway tracks in bihar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8072274-thumbnail-3x2-train.jpg)
కారును ఢీకొన్న రైలు... ఇద్దరు వ్యక్తులు మృతి
ఓ వైపు రైలు వస్తుంటే... కారులోని వ్యక్తులు నిర్లక్ష్యంగా ట్రాక్‌పై నుంచి కారును పోనిచ్చారని, అందువల్లనే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి:చైనా 'ఇరాన్' తంత్రం.. ఎందుకీ దోస్తీ?